శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అసంతృప్తి

ఎద జీల్చుకొని వచ్చి
యిగిరించు నా కోర్కె

మరు మరీచిక వోలె
పరుగెత్తు నెచటకో
గట్టి పట్టున నిల్ప
గా జూచితిని గాని,
తప్పించుకొని నన్ను
తప్పుదారినిబెట్టె;
ఆశించినది చేతి
కందుటలేదు__
చిక్కిన దానితో
తృప్తియులేదు

-- బెంగాలీ - టాగూర్