శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


పాడకే!

ఓ మురళీ పాడకే
నా మది రగిలించకే!!
అతని మనసు గొనితి నంచు
అమ్మా రవళించకే
ఆర్త హృదయమును బాకుల
నదయత హింసించకే!!
ఆయన అధరామృతమ్ము
నంతా త్రాగేయకే
అలమటించు నా మనసున
ఆసపాడు చేయకే!!
అనదను నా నాథునికై
అటమటించు చుంటినే.
అన్యాయము సేయకే
ఆర్తురాలి చంపకే
ఓ మురళీ పాడకే
నా మది రగిలింపకే.

-- గుజరాతీ - దయారాం