శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ఆమోవి

అతని పగడపుమోవి
నుతియించవే
ఆలకించుటకు నే
నారాటపడుచుంటి!
అది పచ్చకర్పూర
మటు పరిమళించునా?
అదిఫుల్లకల్హార
మటు గుబాళించునా?
అతని కెంబెదివి. స
న్నుతి సేయవే
ఆసపడుచుంటి నే;
నాలింప నియ్యవే.

-- తమిళం - ఆండాళ్