శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


బ్రహ్మజ్ఞానం

నామధారణ సేసి,
నడయాడినాను;
ఉరముపై తులసి పే
ర్లరిగి పోయినవి;
యాత్రల కాళ్ళు
కాయలు గాచిపోయె;
ఇంకను హరి
సమీపించనేలేదు,
పెద్ద పురాణాలు
విని, విని చెవులు
చిల్లులువడె గాని
చేకూరలేదు నాకు
బ్రహ్మజ్ఞాన
మీ కానలోన

-- గుజరాతీ - అభా భగత్