శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


శుద్ధప్రేమ

గుణమునకు,
రూపమునకు,
జవ్వనమునకును,
ధనమునకుగూడ
వలపులో తావులేదు;
కామనయె లేని
నిర్మల ప్రేమ,
సకల సౌఖ్యములకెల్ల
నిలయమై చనునుగాదె

-- హిందీ - రసఖాని