శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


విరహిని

చెలిమి నా పేర రచించిన
కృతిని పాడుటకై
అంకపాళిని మాసిపోయిన
చీరెపై పొలతి,
విపంచి నునిచి
కన్నీరు దోగిన తంతు
లెట్లో సారించి,
తన రాగ సరళినే
తాను సారెసారెకును
విస్మరియించి
వగచుచుండు గావలయు
నోహో జలదాత

-- సంస్కృతం - కాళిదాసు