శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ఱెక్కలు పుట్టినవా?

గిరులతో నెక్కు,
మబ్బుల సరస దిరుగు
అలల నర్తించు
పూవుల నవ్వులాడు
చీకటుల జేరి కల గాంచు
చిలిపిమనసౌ,
వలపు పిలుపున
రెక్కలు మొలిచె నేమొ!

-- తమిళం - నమ్మాళ్వార్