శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


చీకటీ!

సాయంతనమ్మైన
శాంతి యేర్పడును
హసియించు క్షణము
సంధ్యా దేవి యంచు
తలచితి; కోయల
పలుకు నటంచు;
గాయమ్ము మాని పో
గల దంచు
హృదయసఖి
భయంకర వార్ధి
సమసిపో వీధి గట్టుపై
వ్రాలగా గలదంచు__
దలచుకొంటి;
నా కోర్కె చేకూరనే లేదు,
హత విధి అట్టహాస
తమసూ మాత్ర
మలముకొన్నది
దిసా వలయమ్ము నెల్ల

-- గుజరాతీ - బలవంతరాయ్ కల్యాణరాయి ఠాకూర్