శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


సముద్రఘోష

ఎందుకంత కళవళపడి
ఎగిరి ఎగిరి పడతావు?
ఎందుకంత నురుగు గ్రక్కి
ఇంత రొప్పుతావు?
ఎందుకలా రేయి పవలు
యేడ్చి బొబ్బలిడుతావు?
ఎందుకోసమైనా నీ
విటు తపించుచున్నావా?
ఎవరి కోసమైనా, ఆ
శించి ఆర్చుచున్నావా?
ఇంతా నా వంటి దాని
వేనా మరి సంద్రమా?

-- తమిళం - నమ్మాళ్వార్