శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


తలుపు తెరువు!

తెరువుమోయి నీ
మంగళ మందిర
పరమ ద్వారము
మాధవా
కరము ఘోరమీ
జీవితవనమును
సరగున నెట్లో
దాటివచ్చితిని!!
ద్వారబంధమును
దవిలి నిల్చి నీ
యోర నిల్చితిని
దయామయా,
ఆరని జ్యోతిని
వెల్గించితి విక
ఏరా అక్కున
నన్ను జేర్చరా!!
నీ నామస్మర
ణే జపమైనది
నీ నిసుగును లా
లింపవా,
నీ నిత్యత్వము
దివ్యత్వమ్మును
నేను కోరి వ
చ్చితి దేవా!!
నీ ప్రేమామృత
రసమును స్వామీ
నాపై కురిపిం
చ వదేమీ?
ఈ పడిగాపులు
పడెడు భక్తు నిక
నీ పజ్జకు జే
ర్పుము స్వామీ
తెరువుమోయి నీ
మంగళ మందిర
పరమ ద్వారము
మాధవా.

-- గుజరాతీ - దయారాం