శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


బాధలు

బాధామయ
పానపాత్ర
ప్రభో నాకు
ప్రాప్తించెను

పిపాసినై
వేడుచుంటి
వేదననే
అందించుము

ఎంతతిట్టి
ఏడ్పించిన
యింత నిసువు
విడుచునా?

తన తల్లిని
తరచి తరచి
తన్మయుడై
అడగడా?

-- తమిళం - కులశేఖర పెరుమాళ్