శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ఎందుకివన్నీ!

తీర్థాలలో జలము
తెఱలుచుండునుగాని,
మునిగి పొందినదేమి
మనకు కనబడదూ!!
ప్రతిమలెల్లను జడత
ప్రార్థించుటయెగాని,
పిలిచి, పిలిపించుకో
గలుగుటే కనపడదు!!
మన పురాణాలు,
కురాను లేమో చెప్పు
గాని, మాయను జీల్చు
టేనాడు కనపడదు!!
స్వానుభవమున చెప్పి
నాను, వట్టి నివెల్ల;
కానిపించిన దేమి
కనబడదు నాకూ __
కనబడదు నాకూ..

-- హిందీ - కబీర్