శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


కాలవస్త్రం

కవలలు రాత్రింబవళ్ళు
కాలవస్త్రమును గట్టిగ
కలిసినేయుచున్నారు;
అపార మిది, అనంత మిది
ఆరు గడులతో నున్నది
అటు వేసే పడుగు పొడవు,
ఇటు వేసే పేక పొట్టి
అటు యిటు నేసినదే యీ
అమలము కాలంబరమ్ము

-- వైదికం - యజుర్వేదం