శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అగపడవేమయ్యా!

యుగములకు యుగములే
తగులబడిపోయినవి;
పగలు రాతిరి పిలిచి
అగడు పడితిమి మేము;
నగధీర! నీ వేమొ
నగుచు నిలిచున్నావు!
తగని ఖేదమ్ముతో
వగచుచుంటిమి మేము
తెగలేదు సందియము
సొగచుయుంటిమి తండ్రి!
అగపడదు మాకింక
నిగమ నుత నీ రూపు -
యుగములకు యుగములే
తగులబడిపోయినవి

--తమిళం - పొఘై ఆళ్వార్