శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన "భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు |
ఉషః కన్య అనారతము రోదసినే అవలోకించుచు నుదయ మ్మయి సర్వము వ్యాపించే అతివ ఈమె ఉషఃకన్య. ఉదయమ్మై మంజుల వ ర్ణోజ్వలాంబరము ధరించి, ఉన్న తురా లీమె వెడలు చున్న దదో కనుంగొనుము. బంగారు పూతలతో నా అంగన అందఱి హృదయము పొంగించుచు వారిలోన రంగళించు జీవరసము -- వైదికం - ఋగ్వేదం |