ఆంధ్రదేశంలో మఱుగున పడిపోయిన ఎన్నో జానపదాలను వెలికితీసిన మహానుభావుడు శ్రీ నేదునూరి గంగాధరంగారు 1960లో కూర్చిన "వేమన పద్యములు" అనే రచనలో 5000 పద్యాలు ఆకారాదిగా అమర్చబడి ఉన్నాయి.
ఆ సంకలనంలోని వీలైనన్ని పద్యాలను ఏమాత్రం ధనార్జన లేని ఉద్దేశంతోనూ, మనవారికి చేరువ చెయ్యాలి అనే ఉద్దేశంతోనూ - పుస్తకం కాపీరైట్ల సంగతి తెలియకనూ ఇక్కడ ప్రచురించటానికి సాహసిస్తున్నాను కాబట్టి - ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియపర్చండి, క్షమాపణలతో వెంటనే తొలగిస్తానని తెలియచేసుకుంటున్నాను.
ఎక్కడైనా తప్పులు కనపడితే దయతో తెలియచెయ్యమని విన్నపం
భవదీయుడు
మాగంటి వంశీ
|