వ్యాస రచన - మీ చిన్నారుల వ్యాసాలకు ఆహ్వానం.

అందరు పిల్లలూ ప్రతిభావంతులే. వారిలోని ప్రతిభను సానబెట్టి బయటకు తీసుకుని రావటం పెద్దవారిగా మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని అమలు చేయటం కోసం మొదలు పెట్టిన ఈ చిన్ని ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారాలు ఆశిస్తూ.

మీ పిల్లల చేత వారికి ఇష్టమయిన వాటి గురించి వ్రాయించండి,అక్షర రూపంలో ప్రాణంపోసి తీర్చిదిద్దిన ఆ రూపాన్ని మాగంటి.ఆర్గ్ కి పంపండి. సంతోషంగా ప్రచురిస్తాను.మీ పిల్లలలోని దాగి ఉన్న సృజనాత్మకతని వెలికితీయండి, వారికి ఇష్టమయినవి ఏమిటో తెలుసుకోండి, వారి భవిష్యత్తుని తీర్చి దిద్దండి.

వ్యాసాలు దేని మీద రాయొచ్చు అంటారా పిల్లలూ ? ఇవిగో ...ఈ క్రింద చూడండి

* మీ అమ్మా నాన్నలు మీ మీద చూపించే ప్రేమ ఆప్యాయతలు గురించి వ్రాయండి
* మీ పాఠశాలలో స్నేహితులు - సరదాల గురించి వ్రాయండి
* మీ పాఠశాలలో మీరు బాగా అభిమానించే ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయురాలు ఎవరు?
* మీకు ఇష్టమయిన వ్యాపకాలు ఏమిటి? అవి అంటే ఎందుకు ఇష్టం?
* మీరు భారతదేశం, లేదా ఏదన్నా యాత్రలకి వెళ్ళినప్పుడు జరిగిన మంచి సంఘటనల గురించి వ్రాయండి.
* మీరు తాతయ్యలతో చనువుగా ఉంటారా? అమ్మమ్మ నానమ్మలతోనా ? కారణాలేమిటి?
* మీకు గ్రామీణ వాతావరణం నచ్చుతుందా? పట్టణ వాతావరణం నచ్చుతుందా? ఎందుకు?
* మీ గ్రామంలోని కొన్ని మంచి విశేషాలు తెలియచెయ్యండి.
* మీకు ఇష్టమయిన పురాణ పురుషులు ఎవరు? వారు అంటే ఎందుకు ఇష్టం?
* పెద్దయ్యాక మీరు యే వృత్తిలో స్థిరపడుదామనుకుంటున్నారు? ఎందుకు ?
* మీకు నచ్చిన పిల్లల పాటలు ఏవి?
* మీకు నచ్చిన పిల్లల పుస్తకాలు ఏవి?
* మీకు సంగీతం అంటే ఇష్టమా? మీ సంగీతం మాష్టారు గురించి వ్రాయండి
* మీకు నృత్యం అంటే ఇష్టమా? మీకు నృత్యం నేర్పించే మాష్టారు గురించి వ్రాయండి
* సమాజానికి ఉపయోగపడే మంచి పనులు ఏవన్నా చేసారా? వాటి గురించి తెలియచెయ్యండి. అది ఎంత చిన్నదయినా సరే (ఒకరికి చేసిన సాయం అవ్వొచ్చు, శ్రమదానం అవ్వొచ్చు - ఇలాగన్న మాట) సంకోచించకుండా వ్రాయండి.
* మీ ప్రతిభని గుర్తించి ఇచ్చిన పతకాల గురించి తెలియచెయ్యండి.
* మీ ప్రాణస్నేహితుడు/ స్నేహితురాలు గురించి వ్రాయండి


ఇలా ఏవయినా సరే, మీకు నచ్చినదాన్ని పేజీలు పేజీలు కాకుండా కొంచెం క్లుప్తంగా వ్రాయండి.

సూచన / గమనిక

1)ఈ వ్యాస రచనా విశేషం ఎనిమిది నుండి పదహారు సంవత్సరాల పిల్లలకు మాత్రమే ఉద్దేశించినది.
2)పిల్లల హోం వర్క్ పెద్దవారు చేసినట్టుగా కాకుండా, వారి చేతే చక్కగా తెలుగులో వ్రాయించండి.
3)చివరగా మీ అందమయిన చిత్రం కానీ, మీ కుటుంబ చిత్రం కానీ వ్యాసంతో పాటు పంపించటం మర్చిపోవద్దు.
4)పంపించే వ్యాసాలు అన్నీ తమ స్వంత రచనలే అయి ఉండాలి.

మీ వ్యాసాల కోసం ఎదురు చూస్తూ

మీ
వంశీ
దక్షిణకొరియా కోన్కుక్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేస్తున్న శ్రీ కొవ్వలి సత్యసాయిగారి పిల్లలు కొవ్వలి సాయీ శ్రావ్య వరాళి, కొవ్వలి సాయీ శౌర్యవరేణ్య వ్రాసి పంపించిన ఈ చిన్ని ఆణిముత్యాలు చూడండి.
కొవ్వలి సాయీ శ్రావ్య వరాళి
కొవ్వలి సాయీ శౌర్యవరేణ్య
కువైట్లో ఇంజినీరుగా పనిచేస్తున్న శ్రీ ఎస్.సుబ్రహ్మణ్యంగారి అబ్బాయి సుధీశ్ వ్రాసి పంపించిన వ్యాసముత్యాలు ఇక్కడ చూడండి
సుధీశ్