రాబిన్ సన్ క్రూసో కథ |
Img Courtesy: en.wikipedia.org |
Robinson Crusoe By Daniel Defoe "రాబిన్ సన్ క్రూసో" - ప్రఖ్యాత ఆంగ్ల రచయిత డేనియల్ డెఫో సుమారు 1719లో వ్రాసిన నవల. కల్పిత గాథ అయినా మనసుకు ఎంతగానో హత్తుకునిపోయే పాత్ర. ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువదించబడ్డ నవల. సుమారు నాలుగు దశాబ్దాల పైనుంచి మా ఇంట్లో ఉన్న ఈ 84 పేజీల చిన్ని పుస్తకం ఎవరు తెలుగులోకి అనువదించారో, వివరాలు ఏమిటో తెలియకపోయినా, ఈనాటి పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రచురించటం జరిగింది. కాపీరైట్ హక్కులను ఉల్లంఘించటానికి చేసిన ప్రయత్నం కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియపర్చండి. క్షమాపణలతో ఈ ప్రతి ఇక్కడినుంచి వెంటనే తొలగించబడుతుంది. ఈ పుస్తకం గొప్పతనం ఏమిటి అంటే, చిన్న చిన్న మాటలతో పాఠకుడిని - అలా కట్టి కూర్చోపెట్టి మొత్తం పుస్తకాన్ని ఏకబిగిన చదివిస్తుంది. చిన్నప్పుడు నామటుకు నేను ఈ పుస్తకం ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు. మీరు కూడా చదువుకోండి. మీ పిల్లల చేత చదివించండి, వీలుకాకపోతే కొంచెం సమయం వెచ్చించి మీరే చదివి పెట్టండి. రచయిత వివరాలు, ఇతర వివరాలు మీకు తెలిస్తే తప్పక తెలియపర్చండి. వారి అనుమతి తీసుకొనటానికి ప్రయత్నిస్తాను మాగంటి వంశీ |
మొదటి పుట |