విశ్వనాథ సత్యనారాయణ గారి బద్దన్న సేనాని నవలా కథనం మీద "97" లో తానా వారి పురస్కారం పొందిన నవల "రేగడి విత్తులు" రచయిత్రి శ్రీమతి చంద్రలత గారి వ్యాసం ఇక్కడ చూడండి |
ప్రస్తుతం నెల్లూరు జిల్లా పొగతోటలో "హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్" గా పనిచేస్తున్న వీరు 1993లో నవలా సాహిత్యలోకం లో అడుగుపెట్టి యాభై కి పైగా కథలు , మూడు నవలలు, ఎన్నో వ్యాసాలు వ్రాసారు.కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఆ గోల్డు మెడల్ పొందిన వీరి రచనా శైలి అద్భుతం. వీరి నవలలు "వర్ధని", "రేగడి విత్తులు" , "దృశ్యాదృశ్యము" తప్పక చదివి తీరవల్సినవి.. |
శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారి అసంపూర్ణ రచన "పురాణ వైరాగ్యం" పూర్తి చేసిన ఘనత వీరికి దక్కుతుంది. ఇవి కాక ఎన్నో పురస్కారాలు, అభినందనలు, అవార్డులు పొందిన ఈ అచ్చ తెలుగు మహిళ, ఈ విధంగా తన వ్యాసం మీతో పంచుకోమని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో |