ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ చల్లా కృష్ణమూర్తి గారి కుమార్తె, డాక్టర్ చల్లా విజయలక్ష్మిగారు తన పరిశోధక గ్రంథం "ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం" లో ఆయా సంస్థానాల సంగీతపోషణ గురించి విస్తృతంగా వివరిస్తారు. తన పరిశోధనలో భాగంగా చాలా మంది ప్రముఖులను ఇంటర్వ్యూలు కూడా చేసారు. ఆ ఇంటర్వ్యూ లు సంక్షిప్తంగా తన పుస్తకంలో ప్రచురించారు. ఆ ఇంటర్వ్యూలలో ఒక ఇంటర్వ్యూ - శ్రీ ద్వారం భావనారాయణరావు గారితో ఉన్నది. శ్రీ ద్వారం భావనారాయణరావు గారు 1970 ప్రాంతాల్లో విజయనగరం సంగీత కళాశాల అధ్యక్షులుగా పని చేసారు. ప్రసిద్ధ గాయకులు, సంగీత గ్రంథ కర్త. ఆ ఇంటర్వ్యూ భాగం ఇక్కడ చూడవచ్చు. అడగగానే ఆ ఇంటర్వ్యూను ఇక్కడ ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు డాక్టర్ చల్లా విజయలక్ష్మి గారికి సహస్ర కృతజ్ఞతలు. పూర్తి పుస్తకం "సంస్థానములు" సెక్షన్లో చూడవచ్చు. ఈ పుస్తకంపై సర్వ హక్కులు వారికే చెందుతాయనీ, ఎవరైనా వాడుకోదలిస్తే ముందుగా వారి అనుమతి తీసుకోవాలని తెలియచేసుకుంటున్నాను.
Keywords: Dr. Challa Vijayalakshmi, Samsthanalu, Sangeeta Poshana |