కౌముది పత్రిక సంపాదకుడు,
ప్రముఖ కవి కిరణ్ ప్రభగారితో
ముఖాముఖి

భూగోళానికి ఇవతలివైపున అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక చిన్న నగరంలో నివసిస్తూ, ఒక పూర్తిస్థాయి తెలుగు పత్రికను నడపడం అనేది చెప్పుకోదగ్గ విశేషమే. ప్రతినెలా దాదాపు 35 శీర్షికలతో , 150 పేజీల పత్రికను క్రమం తప్పకుండా తీసుకురావడం అభినందించదగ్గ విషయం. ప్రస్తుతం ఇంటర్నెట్ కే పరిమితమయిన ఈ పత్రిక అత్యంత ఉత్తమమయిన సాహితీవిలువలు కల రచనలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అందిస్తోంది అనటంలో అతిశయోక్తి లేదు. ఆ విశిష్ట పత్రిక పేరు కౌముది. ఈ విశిష్టపత్రిక స్థాపకుడు, నిర్వాహకుడు, సంపాదకుడూ అయిన కిరణ్ ప్రభ (శ్రీ పాతూరి ప్రభాకర రావు) గారితో ముఖాముఖీ కార్యక్రమంలో ముచ్చటించటానికి అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ, ఆయన అనుభవాలు, ఆలోచనలు, సూచనలు మీతో పంచుకుంటున్నాం.

సాంకేతిక సహాయం :
ఆప్త మిత్రుడు "రవి ముత్యాల"
సహోద్యోగి "శ్రీమతి కారొల్ బ్లేక్"


www.maganti.org