తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సాహిత్యంలో తనదైన, అరుదయిన ముద్రను వేసిన సాహిత్యవేత్త. తన రచనా నేపథ్యం గురించి ఆయన స్వంతమాటల్లో, ఈ క్రింద ఉన్న ధిక్కారం రచనలో 341 - 381 వరకు ఉన్న పేజీల్లో వివరించారు. చదివి ఆనందించండి. ఆయన రాసిన కథలు మాగంటి.ఆర్గ్ లో ప్రచురించటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకు శతసహస్ర ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మిత్రులు శ్రీ వారాల ఆనంద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
రఘోత్తమ రెడ్డిగారు తాను రాయాలనుకున్న కథను చాలా లోతుగా చూస్తారనీ, మానవ సంబంధాల్లో, విలువల్లో ఉద్యమాలు తీసుకువస్తున్న ఘర్షణను సంక్లిష్టంగా, ప్రతిభావంతంగా చిత్రిస్తారని ప్రొఫెస్సర్ జి.హరగోపాల్ గారు అన్నా, సదా శ్రోతగా ఉండి తనను కదిలించిన జీవిత శకలాలను వస్తువులుగా చేసుకొని కథలు రాయడమే తెలిసిన మనిషి అని కాళీపట్నం రామారావు గారు అన్నా, రఘోత్తమరెడ్డిగారిలో మితిమీరిన సంవేదనా శీలత ఉన్నది, ఆయన ఏది చెప్పినా అబద్ధం చెప్పడు అని డాక్టర్ సదాశివ గారు అన్నా, కొ.కు, చా.సో, రావి శాస్త్రి, కా.రా ల నుంచి కొత్తకథల్ని ఆశించే అవకాశాన్ని పోగుట్టుకుని దిగులుగా ఉన్న నాలాంటి కథాభిమానుల్లో ఆశ రగిలించిన కొద్దిమంది యువ రచయితల్లో రఘోత్తమ రెడ్డి ముఖ్యుడు అని వల్లంపాటి సుబ్బయ్యగారు అన్నా, తను కోరుకుంటున్న అచ్చమైన, సృజనాత్మకమయిన, కళాత్మకమయిన జీవితం కోసం, మనుషులకోసం, విలువల కోసం పరితపించే మనిషి అని అల్లం రాజయ్య గారు అన్నా, భూగర్భంలో పొరలు పొరలుగా అల్లుకున్న బొగ్గుట్టలను చెమ్మాసుతో తోడినట్టే, మానవ సంబంధాలలో పొరలు పొరలుగా విస్తరించిన అనేక ఉద్వేగాలను రఘోత్తమ రెడ్డి, తన కలంతో తవ్వి కథల కుప్పలు పోసిపెట్టాడు అని ప్రేమతో ఎన్.వేణుగోపాల్ గారు అన్నా అందులో అతిశయోక్తి ఏమీ లేదు. వీలు వెంబడి ఆయన కథలు ఒకటొకటిగా మీ ముందుకు తీసుకుని రావటానికి ప్రయత్నం జరుగుతుంది అని తెలియచేసుకుంటున్నాను. ఈ కథల మీద సర్వహక్కులు వారివే అనీ, ఎవరయినా వాడుకోదలిస్తే ఆయనను ముందుగా సంప్రదించి అనుమతి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. పుస్తక ప్రతులకు, ఇతర వివరాల కోసం రఘోత్తమరెడ్డి గారిని , వారాల ఆనంద్ గారిని ఈ క్రింది చోట్ల సంప్రదించవచ్చు THUMMETI RAGHOTHAMA REDDY H.No. 6-4-278/1, I.B.COLONY GODAVARIKHANI DIST: KARIMNAGAR, A.P. INDIA CELL: 919346263210 VARALA ANAND, 8-4-641, HANUMAN NAGAR , KARIMNAGAR-A.P. INDIA varalaanand @ yahoo.com, varalaanand @ gmail.com phone: 9108782235897, CELL : 919440501281 |
తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు On Kinige |