చిత్రలేఖనం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
ఈ పుటలో కొన్ని పెన్సిల్ డ్రాయింగ్స్, కొన్ని పెయింటింగులు - చిత్రకళకు సంబంధించిన కొన్ని వివరాలు చూడవచ్చు. మరింతమంది కళాకారుల సహాయ సహకారాలతో , ముందు ముందు , వీలైనన్ని చిత్రాలు చేర్చడానికి కృషి చేస్తానని తెలియచేసుకుంటూ
మీరు ఆర్టిష్టులైతే, లేదా మీకు తెలిసిన వారి డ్రాయింగులు మరింత మందికి చేరాలని, చేర్చాలనీ కోరిక ఉంటే, దయచేసి గెస్టు బుక్కు నుంచి కామెంటు ద్వారా వివరాలు పంపించండి.
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|
డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు తన యుక్త వయసులో, అంటే 1960ల్లో గీసిన కొన్ని డ్రాయింగ్స్......ఈ డ్రాయింగ్సు గురించి ఆయన మాటల్లోనే -
" The inspiration was of course artwork by Chitra and Sankar garu. The choice of the subjects also reflects my interests of the period. For some reason, I lost my skill and interest soon after and took to classical music completely.
|
కృష్ణాపత్రిక ప్రముఖులు శ్రీ రావూరు సత్యనారాయణరావు గారి కుమార్తె శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారు గీసిన బొమ్మలు కొన్ని. శ్రీమతి జ్ఞానప్రసూన గారు తెలుగు బ్లాగు ప్రపంచంలో కూడా చాలా మందికి పరిచయమైన వారే. ఆరుపదుల వయసులో ఇరవయ్యేళ్ళ ఉత్సాహంతో ఎంతో చలాకీగా ఉండే ఆవిడను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉన్నది.
|
1837వ సంవత్సరంలో Seventy-two Specimens of Castes in India అన్న్ పుస్తకం ఒకటి ప్రచురించబడ్డది
ఆ పుస్తకం వివరాలు ఇలా ఉన్నవి
This is a manuscript titled "Seventy-two Specimens of Castes in India", which consists of 72 full-color hand-painted images of men and women of the various castes and religious and ethnic groups found in Madura, India at that time. Each drawing was made on mica, a transparent, flaky mineral which splits into thin, transparent sheets. As indicated on the presentation page, the album was compiled by the Indian writing master at an English school established by American missionaries in Madura, and given to the Reverend William Twining. The manuscript shows Indian dress and jewelry adornment in the Madura region as they appeared before the onset of Western influences on South Asian dress and style. Each illustrated portrait is captioned in English and in Tamil, and the title page of the work includes English, Tamil, and Telugu.
Source: Beinecke Rare Book & Manuscript Library, Yale University
http://beinecke.library.yale.edu/digitallibrary/india.html
ఆ పుస్తకంలోని బొమ్మలు ఆసక్తి ఉన్నవారందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంతో ఇక్కడ ఆ బొమ్మలు ప్రచురించడం జరిగింది. మీ దగ్గర ఇతర వివరాలేవన్నా ఉంటే పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి |
|