ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
ఆకాశవాణితో పరిచయమున్న వారికి, ప్రత్యేకించి విజయవాడ / విశాఖపట్నం శ్రోతలకు శ్రీ ఎం.ఎల్.నరసింహం గారంటే చప్పున ఆయన గళంలో జాలువారిన ఎన్నో మధురమైన గీతాలు, కర్నాటక శాస్త్రీయ సంగీత గీతాలు గుర్తుకొస్తాయి. తన గళంతో శ్రోతలను కట్టిపడేసి, ముగ్ధులను చేసేసి ఈనాటికి కూడా ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప కళాకారులు శ్రీ నరసింహంగారు. వారి అబ్బాయి - బాలగంధర్వుడిగా పేరుపొందిన శ్రీ మండా కృష్ణమోహన్ గారు సహృదయంతో తన వద్దనున్న ఆడియోల భాండారం నుంచి తాను పాడిన గీతాలు, తన తండ్రిగారు శ్రీ నరసింహంగారి గీతాలు మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు, వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో.
శాస్త్రీయ సంగీత అభిమానులకు ఈ ఆడియోలు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాము
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|