మీగడ తరకలు

వడపై, నావడపై, పకోడిపయి....


కందుకూరి వీరేశలింగం గారి ఆంధ్రకవుల చరిత్ర ప్రథమభాగం లో తిక్కన రచనగా ఈ ప్రసిద్ధ పద్యం ప్రస్తావించబడింది

అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై కుబ్జపై
నరుపై ద్రౌపదిపై కుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపై
పరగం గల్గు భవత్కృపారసము నాపై కొంత రానిమ్ము నీ
చరణబ్జంబుల నమ్మినాను జగదీశా ! కృష్ణ! భక్తప్రియా!


అయితే దీనికి అబ్బూరి రామకృష్ణారావు రాసిన పేరడి ఇదిగో

వడపై, నావడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియో
పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్ బోండాపయిన్ సేమియా
సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే
నుడుకుం గాఫిని ఒక్క చుక్క గొనవే! ఓ కుంభోదంభోదర!

మాతృకలో భగవద్భక్తుల పట్టిక వరసగా పేర్కొనబడితే, ఈ పేరడిలో తినుబండారాలు పేర్కొనబడ్డాయి.

మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి మిత్రుడు డాక్టర్ వెలుదండ నిత్యానందరావు గారు వ్రాసిన "తెలుగు సాహిత్యంలో పేరడీ" పుస్తకం నుండి.


www.maganti.org