పకోడీ గురించి తిరుపతి వేంకటేశ్వర కవుల వారు, తాము జరిపిన ఒక శతావధానము లోని "చంపకమాల" పద్యం |
కరకరలాడు కొంచెమగుకారము గల్గు బలాండువాసనా |
హర మగుగొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట |
ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా |
దరమునబల్కుచుందు రదితాదృశమే యగునంచుదోచెడిన్ |