నవ్వుల తోట అనే పత్రికలో 1922 వ సంవత్సరం ప్రచురణలో నండూరి వారి ఎంకి పాటకి ఒక పేరడీ / అనుకరణగా "టెంకిపాట" ఒకటి అచ్చయ్యింది. రచయిత పేరు ఎవరో తెలియదు. |
రావెరావె నా టెంకిరావె ముద్దులటెంకి |
గోరంచు కోకెడ్త, కొప్పులో పూలెడ్త |
కోరిన నగలెడ్త, కులికించి ముద్దులెడ్త రావె |
నిన్నటి రేయి నేను నిన్నుకలలో జూచి |
కన్నీరు గారిస్తి కనకంపుముద్దుల టెంకి రావె |
పాలీల పండగనాడు పొట్టనిండ తాగితాగి |
పక్కనున్న నిన్నుజూచి సంకల్లన్ని గుద్దుకొంటి రావె |