మీగడ తరకలు

తల తిప్పుడు వ్యాధి గల నా తల ఊగడంలో ...


చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు, మంచి హాస్యస్ఫూర్తి గలవారు. ఒక సారి ప్రసిద్ధ గాయనీమణి శ్రీమతి బెజవాడ రాజరత్నంగారి సంగీత కచేరి జరిగిన సందర్భంలో, ఆమెను గురించి చెళ్ళపిళ్ళ వారు ప్రశంసావాక్యాలు చెప్ప వలసి వచ్చిందిట. అప్పుడు ఆయన, సభలో ఎప్పుడూ గంభీరంగా వుండే ఒక పెద్ద మనిషిని చూపిస్తూ 'రాజ రత్నం సంగీతానికి అచల శిరస్కులైన వారి తలే ఊగగా లేనిది తల తిప్పుడు వ్యాధి గల నా తల ఊగడంలో ఆశ్చర్యం ఏముంది?' అన్నారట.


www.maganti.org