తెనాలి రామలింగడితో పెట్టుకున్నవాడి పని హాంఫట్ అని తెలియజేసే ఒక చురుకు చురక. - ఎవరిమీద పడితే వారి మీద ఒంటికాలి మీద లేచే రామలింగడి మీద కోపంతో పింగళి సూరన్న, ఒక రోజు "తెన్నాలి రామలింగడు తిన్నాడుర తట్టెడంత" అని ఒక పద్యం ఎత్తుకున్నాడట. వికటకవీంద్రులవారు ఊరుకుంటారా ? వెంటనే "తియ్యని బెల్లం బెన్నగ మన పింగళి సూరన్నకు నోరంత పేడ అయ్యెను గదరా!" అని పూరించాడట..ఇక సూరన్న గారి మొహం ఏలాగున ఉన్నదో చెప్పతరమా? |