మీగడ తరకలు

తరిగొండ వెంకమాంబ సోది భాష


తరిగొండ వెంకమాంబ వేంకటాచల మాహాత్మ్యం అనే కావ్యంలో ఎరుకసాని పాత్రను ప్రవేశపెట్టి పాత్రోచిత భాషగా సోదిభాషను ప్రయోగించిన ప్రతిభావంతురాలు. మచ్చుకి -
"అవ్వోయవ్వ. నీ తలంచిన తలంపు మేలవుతాదంట. దేవుళ్ళు పలుకుసుండారు. తలచిన తలపేమంటివా, సెప్పెద విను దయితమ్మ! బిడ్డంటే కడుపు సూపుదు. తోడబుట్టంటే బుజము సూపుదు. నీవిటు తోడబుట్టు కడుగలేదు. ఇట్లా బిడ్డకడుగుసుండావు.యాడబిడ్డంటే చెవి సూపుదు. మగబిడ్డంటే గడ్డము సూపుదు. ఇదిగో యిట్టి మగబిడ్డకడుగలేదు. ఆడుబిడ్డకడుగుసుండావే అవ్వోయవ్వ యీ యాడుబిడ్డ కొకసింత కలిగియుండాది. ఆ సింత యేమంటావా, నిన్న నీ బిడ్డ వనానికేగినాది. ఆడ తేజినెక్కిన నల్లనయ్యను చూచి వలపుగొన్నాది. ఆ నల్లనయ్య యేదిక్కునుండి వచ్చినాడంటావా? తల్లీ యిదిగో యీమూలనుండియే వచ్చాడే..."www.maganti.org