కృష్ణదేవరాయల వారు ఒకనాడు పెద్ద పళ్ళెం తెప్పించి ఎవరయినా ఒక నిర్దుష్టమయిన పద్యం చెప్పిన వారు , ఆ పళ్ళెరంలోని కానుకలన్నిటినీ తీసుకొనిపోవచ్చు అనగా - పెద్దన గారు - |
"శర సంధాన బల క్షమా గురుత రైశ్వర్యంబులున్ కల్గి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్ నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా నరసింహ క్షితిమండలేశ్వరుల కృష్ణా ! రాజకంఠీరవా !" అని చెప్పాడట. |
దీని అర్థం - నరసింహ క్షితి మండలేశ్వరుడి కుమారుడయిన కృష్ణదేవరాయలవారిని నరుడితోనూ, సింహంతోనూ, క్షితిమండలంతోనూ, ఈశ్వరుడితోనూ పోల్చవచ్చుట. ఎప్పుడు? నరుడికి బృహన్నల రూపం లేనప్పుడు, సింహానికి గుహ నివాసం లేకున్నప్పుడు, క్షితి మండలానికి నిరంతర చలనం లేనప్పుడు, ఈశ్వరుడికి బ్రహ్మఘ్నత లేనప్పుడు మాత్రమే అని. |
అయితే రామలింగడు ఊరుకుంటాడా? అద్భుతమయిన దోషం ఒకటి చూపించాడట ఇందులో."ఒక పక్క సింహానికి బిలప్రవేశ దోషం ఉంది అని చెపుతూనే, మళ్ళీ కృష్ణరాయలవారిని రాజకంఠీరవా అని సంబోధించడం దోషమే" అని తేల్చి చెప్పాడట. |