మీగడ తరకలు

పొట్ట కోసినా అక్షరం


ఆరుద్రకి కడుపుకి ఆపరేషన్‌ చెయ్యబోతున్నారు. డాక్టర్‌ గార్ని ఆరుద్ర, " ఏమండీ, ఆపరేషన్‌ చేసేప్పుడు నా పొట్టకేసి ఒకసారి చూడవచ్చా? " అని అడిగాడట. డాక్టర్‌, " చూడవచ్చు గానీ ఎందుకండీ చూడటం? " అన్నాడట. వెంటనే ఆరుద్ర, " ఏం లేదు పొట్టకోసినా వీడికి అక్షరం ముక్క లేదు అంటారు కదా, నా పొట్టలో అక్షరం ముక్క ఉందో లేదో చూసుకుందామని " అని చమత్కరించాట్ట.www.maganti.org