మీగడ తరకలు

పెళ్ళివల్ల సరళం


కట్టమంచి రామలింగారెడ్డిగారు చతురోక్తులలో ఆరితేరినవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా వుండగా పి.కమలమ్మ అనే సెనెట్ సభ్యురాలికి వివాహమైంది. వివాహమైన తర్వాత ఆమె పేరు బి.కమలమ్మ గా మారింది. ముక్తసరిగా - నిక్కచ్చిగా - కుండబద్దలు కొట్టినట్టు (పరుషంగా) మాట్లాడే స్వభావం కమలమ్మగారిది. దీనిని దృష్టిలో వుంచుకొని రెడ్డిగారు వివాహం తర్వాత ఆమెను ఉద్దేశించి "మొత్తం మీద పెళ్ళివల్ల పరుషం సరళమైంది" అని ఛలోక్తి విసిరారు.


డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు నుండి


www.maganti.org