శ్రీ పామర్తి సత్యనారాయణ గారిని "హాస్య బ్రహ్మ" అని పిలవటంలో తప్పు లేదు అని నా అభిప్రాయం. ముక్కు సూటిగా మాట్లాడటంలో కానీ, ఇతరంగా కానీ ఆయన రాసే ప్రతి రాతలోనూ, వాడే ప్రతి మాటలోనూ ఎంతో మధురమయిన హాస్యం తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయన హాస్యస్ఫోరకమయిన మాటలు మచ్చుకి కొన్ని ఇక్కడ ప్రచురిద్దాము అని సంకల్పించాను. వీరి గురించి, వీరి హాస్యం గురించి సవివర విశేషాలతో త్వరలో మీ ముందుకు ...ప్రస్తుతానికి ఒక చిన్న హాస్యపు తునక - మన సంస్కృతి, సాంప్రదాయం, పద్ధతి గురించి ఆయన వ్యంగ్యంగా రాసిన ఒక చిన్న కవిత చూడండి.. |
ఒకరు, ఒకసమయమున, ఒక తప్పును చేసినచో అది తప్పు |
ఒకరు, పలుసమయములందు, ఒక తప్పును చేసినచో అది పద్ధతి |
పలురు, పలుసమయములందు, ఒక తప్పును చేసినచో అది సంప్రదాయము |
పలురు, పలుసమయములందు, పలు తప్పులు చేసినచో అది సంస్కృతి |