మీగడ తరకలు

ఆదిభట్ట వారి మణిప్రవాళం


అజ్జాడ గ్రామంలో జన్మించిన మహానుభావుడు శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారు మంచి కవి కూడా. వారు తెలుగు, ఇంగ్లీషు, పార్సీ, సంస్కృత భాషలు కలిసిన మణిప్రవాళ శైలిలో ఒక పద్యం చెప్పారు. కవిత్వం మీద ఎంతో పట్టు ఉంటే కానీ ఈ మణిప్రవాళం అంతు పట్టటం సాధ్య కాదని అందరు ఎరిగిన విషయమే -
మేటి పంటల టెంకి కల్మిమెడ లంకి - "తెలుగు"
బెస్టు టౌ నిన్ గొడావరి యీస్ట్ ది సీ జె - "ఆంగ్లం"
మిర్బు పీర్వ మివాన్ జవాల్ మీర్జవాన - "పార్శీ"
పీఠికాపుర మేవ త్రివిష్టప మిహ - "సంస్కృతం "


www.maganti.org