మీగడ తరకలు

రాజన రాజు మల్కి ఇభరాముడె


దక్కను సామ్రాజ్యాన్ని పరిపాలించిన గోల్కొండ నవాబుల్లో తెలుగు సాహిత్యపరంగా పేరెన్నికగన్న మహారాజు - మల్కిభరాముడు. ఈయన విజయనగర సామ్రాజ్య అళియ రామరాయలు సంరక్షణలో ఏడేళ్ళు గడిపి ఆంధ్ర సాహితీ సువాసనా సౌరభం గుబాళించే గాలులు పీల్చినందువల్లో కానీ, ఆంధ్ర కవి పండిత పోషకుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన కీర్తి వైభవాన్ని వర్ణిస్తూ ఒక చాటు కవి చెప్పిన చాటువు చూడండి
రాజును రాజుకా డతడు రాహు ముఖంబున చిక్కె; వాహినీ
రాజును రాజుకా డతడు రామ శరాహతి తూలె దేవతా;
రాజును రాజుకా డతడు రావణ సూతికి ఓడె ఆజిలో;
రాజన రాజు మల్కి ఇభరాముడె రాజు ధరాతలంబునన్!


శ్రీ మాగంటి శివరామ శర్మ గారి పాత డైరీ నుండి


www.maganti.org