ఓసారి అళియ రామరాయలవారికి వాయురోగం వచ్చిందిట. మందులకోసం, వైద్యుని కోసం అంతా కంగారు పడుతూ ఉంటే, తెనాలి రామలింగడు దీనికంత కంగారు పడతారెందుకు? అంటూ రోగం నయమయ్యే చిట్కా చెప్పాడట |
"వోయమ్మలార! మందులు
వేయేల మకారకొమ్ము విషకవిగానిన్ వాయెత్తకుండ జేసిన వాయెత్తదు రామరాయ వసుధేశునకున్" |
- మందులెందుకు దండగ! మకారకొమ్ము విషకవి వున్నాడే - మూర్తి కవి (భట్టుమూర్తి) - అతని వాగుడు కాస్త కట్టువడితే చాలు, రామరాయలవారి రోగం ఇట్టే నయమైపోతుంది. కాబట్టి అతని నోరు మూయించడమే మందు" అన్నాట్ట |
తెనాలి రామలింగడికీ, భట్టుమూర్తికీ వైరం ఉండేదని చెప్పే చాటువు ఇది. |