డాక్టర్ వెలుదండ నిత్యానందరావుగారు రచించిన "తెలుగు సాహిత్యంలో పేరడీ" అనే పుస్తకంలో నుంచి ఒక పేరడీ - |
|
|
|
"ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధేశ్వేతవరాహకల్పే...." అని సంకల్పం చెప్పుకోవటం అందరికీ తెలిసిందే కదా...ఇది ఆంధ్రదేశంలో ఉన్న ఆంధ్రులకి సరిపోతుంది. మరి లండన్ లో ఉన్నవాళ్ళు సంకల్పం ఇలా చెప్పుకుంటారు అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు తెలియచేస్తున్నారు
|
|
|
|
"లండన్ వే స్వాహా జూశసే స్వాహ - క్రైస్తవే స్వాహా - ఇంగ్లండ్ - స్కాట్లండ్ - ఐర్లండ్ తత్త్రైస్తోర్వరేణ్యం - జుహోవా దేవస్య ధీమహీ - ధియోయోనః ప్రచోదయాత్" తో మొదలు అయ్యి
"భూమేః పూర్వగోళార్థే యూరప్ఖండే, రష్యా, జర్మనీ, ఫ్రాన్సు, స్వీడనేత్యాది మహాదేశానాం పశ్చిమ ప్రాంతే - చతుస్సముద్ర ముద్రిత గ్రేటుబ్రిటన్నామక మహాద్వీపే చవియట్పర్వతస్య దక్షిణ దిగ్భాగే - వేల్సుదేశస్యాగ్నేయభాగే బ్రిస్టల్కుల్యాయాః ప్రాగ్దేశే...అస్మిన్వర్తమాన వ్యావహారిక హూణమానేన క్రీస్తో రనంతరం వింశతి తమ శతాబ్దే ...అఖండ థేంస్ నద్యాం వీరభద్రశర్మాహం జ్ఞానస్నానం కరిష్యే" ఇలా సాగిపోతుంది..
|
|
|
|
ఇది "చిలకమర్తి ప్రహసనములు" లో నుండి "లండన్ సంకల్పం" పేరడీ అని డాక్టర్ నిత్యానందరావుగారు తెలియచేస్తున్నారు. ఈ పుస్తకం త్వరలో మీ ముందుకు maganti.org లో...ప్రచురించుకోవటానికి అనుమతి ఇచ్చిన డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి మిత్రులు నిత్యానందరావుగారికి సహస్ర ధన్యవాదాలతో
|
|
|
|