మీగడ తరకలు

కాటూరి విసుగు - దేవులపల్లి కృష్ణ శాస్త్రి సమాధాన సొబగు


దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక సారి రైలులో కాటూరివారితో కావలి వెడుతూ ఉండగా, కాటూరి వారికి ప్రయాణం అంటే విసుగొచ్చి "ఇంకా ఎక్కడ ఉందయ్యా ఆ ఊరు?" అని విసుక్కోగా , కృష్ణశాస్త్రి గారు చెప్పిన సమాధానం ఇది
కలవు నాలు గూళ్ళు కావలి కీవల
బిట్రగుంట ఒకటి పెద్ద స్టేష
నులవపాడు మాత్ర మొంగోలు వైపున
పడుగుపాడు పిదప కొడవలూరు


శ్రీ మాగంటి శివరామ శర్మ గారి పాత డైరీ నుండి


www.maganti.org