మీగడ తరకలు

కుదరని జంటకవిత్వం


తొలినాళ్ళలో దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుఱ్ఱం జాషువా కలిసి జంటకవిత్వం రాద్దామనుకున్నారు. తిరుపతి వేంకట కవుల్లాగా ఒక మంచి పేరు పెట్టుకుందామనుకున్నారు- దీపాల జాషువా, గుఱ్ఱం పిచ్చయ్య, పిచ్చయ్య జాషువా, గుఱ్ఱం దీపాల, గుఱ్ఱం శాస్త్రి .. ఇలా అన్ని రకాలుగా చూస్తే సరైన పేరే కుదరలేదు. అప్పుడు "మనకు పేరే కుదరటంలేదు- ఇక జంటకవిత్వం ఎందుకులే" అనుకొని మానేశారుట!


డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు నుండి


www.maganti.org