ఆధునిక కాలంలో స్త్రీలు అన్నిరంగాలలోను పురుషులను మించి రాణిస్తున్నారు అని పోతనగారి మార్గంలో శ్రీ పాయల సత్యనారాయణగారు వామనావస్థలోనున్న స్త్రీలు త్రివిక్రముడిలాగా విజృంభించడాన్ని అక్షర కల్పన చేసిన విధం ఇదిగో.
ఇంతింతై వధువింతయై గృహమునందింతై స్వయంవీధిలో నంతై, గ్రామసభా విభాగమున కల్లంతై స్వతాలూకపై నంతై మండలమంతయై మరియు తానాంధ్ర ప్రదేశమ్ముపై నంతై భారతదేశమంతయయి బ్రహ్మాండాంత సంవర్ధియై మగరాయండుపమింప భర్తయయి, క్షేమంబెన్ను నేస్తంబునై సగమై పాంపుకు రాత్రికే హితుడునై సామాన్యమౌ నౌకరై వగలాడై నిజపాదదాసుదై, అవ్యాజమ్ముగా బానిసై పగవాడై నడపీనుగై, మహిళ తాబ్రహ్మాండమున్ నిండుచోన్ !! మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి మిత్రుడు డాక్టర్ వెలుదండ నిత్యానందరావు గారు వ్రాసిన "తెలుగు సాహిత్యంలో పేరడీ" పుస్తకం నుండి. |