మీగడ తరకలు

గురుజాడ అప్పారావు గారి ఆశు పద్యం


ఒక సారి చక్రవర్తుల తాతాచార్లు అనే ఆయన రేవా రాణి గారి కొలువులో గురుజాడ అప్పారావు గారిని " ఏదీ నా మీద ఆశువుగా పాట కట్టు చూద్దాం - నీ ప్రజ్ఞ" అని సవాలు చెయ్యగా, అప్పారావుగారు విసిరిన చెణుకు ఇదిగో -
"నూగు మీసపు కట్టు - కానరాని బొట్టు
నోటాన సిగరెట్టు - కోటు వింత కుట్టు
చే కర్ర జిలుగు వెండి కట్టు
నీలగిరి కొలను గట్టు
పై విహరించు వైష్ణవ భొట్టు"


www.maganti.org