మీగడ తరకలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్యారడీ


దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎంత భావకవి అయినా, 'అనంత శోకభీకర తిమిర లోకైక పతిని" అని చెప్పుకొన్నా హాస్యప్రియత్వం లేకపోలేదు. 1945 ప్రాంతాల్లోనే ఆంధ్రజ్యోతిలోనూ, సోమసుందర్ నిర్వహణలో వెలువడే లిఖిత పత్రిక "అక్షయపాత్ర" లోనూ దేవులపల్లి చమత్కారంగా వేమనపై ప్యారడీలూ రాశారు.

"పట్టిపట్టి గుడికి పదిమంది నేస్తాలు
పర్వదినమటంచు పంపితేను
అతడు కన్నుకొట్టె అమ్మవారినిజూచి
విశ్వదాభిరామ వినురవేమ!"


"నాటకాలలోన నారి వేసము వేయ
పురుషునట్టులుండు పోతురాజు
ఉత్తయప్డు సరిగ యువతీలలామయే
విశ్వ.."


దేవులపల్లికే భావకవుల అతిని చూచి విసుగుపుట్టిందేమో మరి - ఈ ప్యారడీ వచ్చింది


"మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవిలేవు
కవితయందుతప్ప గట్టివాడన్నింట
విశ్వ...."



డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి


www.maganti.org