మీగడ తరకలు

కృష్ణదేవరాయల కంటె ముందరే వల్లభరాయలవారు శలవిచ్చారు!


1430 ప్రాంతంలోని సాహితీవేత్త వినుకొండ వల్లభరాయడు రాసిన క్రీడాభిరామం - ఆనాటి ఓరుగల్లు వీథులలో వెల్లి విరిసిన ఆంధ్ర సాంఘిక జీవన చలన చిత్రం. ఈ అద్భుతమయిన కావ్యంలో "దేశభాషలందు తెలుగు లెస్స" అని కృష్ణదేవరాయల కంటె ముందరే వల్లభరాయలవారు శలవిచ్చారు. ఇద్దరూ "రాయలే" అయినా ఒకాయన నిఝ్ఝంగా రాజుగారు అవ్వటంవల్ల, రాజు గారి మాట ప్రపంచానికి బాట అయ్యిందన్నమాట...


ఆ.వె - జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?


కానీ రాయలవారు కూడా "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పారు కాబట్టి దానికి అంత విఖ్యాతి వచ్చింది అనుకోవాలి ... :)..

కాకపోతే క్రీడాభిరామం శ్రీనాథుడు వ్రాసి వుండవచ్చు అని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు విభేదిస్తున్నారట.www.maganti.org