మీగడ తరకలు

చీకట్లో అరసున్న!


తిరుపతి వెంకట కవుల వాగ్ధాటికి అడ్డూ ఆపూ ఉండేది కాదు. ఎవర్నైనా ఎలాగైనా బోల్తా కొట్టించగలిగే వారు. ఒకసారి అవధాన సభలో అప్రస్తుతప్రసంగి " అవధాని గారూ! చీకట్లో అరసున్న ఉంటుందా? " అని అడిగాడట. నిజమే, గ్రాంథిక తెలుగులో ఏ పదంలో అరసున్న ఉంటుందో, ఎందులో ఉండదో చెప్పటం తేలికైన విషయం కాదు. " చీకటి " లో అరసున్న ఉంటుందనీ ఉండదనీ వాదోపవాదాలు జరిగేవా రోజుల్లో. ఈ తగాదాలోకి వెళ్ళకుండా అవధానులు ఇలా చమత్కరించారు " చీకటి కదండీ, అరసున్న ఉందో లేదో కనబడటం లేదు! "



www.maganti.org