మీగడ తరకలు

మల్లినాథ సూరి గారి ఆవకాయ పాట


స్వర్గీయ మల్లినాథ సూరి గారు (కృష్ణా పత్రిక) ఒక వేసంకాలం బంధువుల పెళ్ళికి వెళ్ళిరావటం, ఆ నెలలోనే ఆవకాయ, మాగాయ కూడా పెట్టించటం మూలాన ఖర్చు చాలా అయ్యిందిట.అప్పుడు వారు కట్టి పాడిన పాట
మున్నాళ్ళ పెళ్ళికి ముప్ఫైయ్యి వదిలాయి రామచంద్రా!!
రైలువాడికి ఇస్తి రానూపోనూ ఇరవై రామచంద్రా!!
పెట్టికూలికి పోయె పైనొక్క రూపాయి
బండ్లవాళ్ళకు ఇస్తి పధ్నాలుగణాలు !!రామ!!
ఇంటావిడకు కుట్టిస్తి వంటిమెడ రెవిక !!రామ!!
ఒక్క రెవికకి పట్టె రొక్కమ్ము రెండు
కుట్టువాడికి ఇస్తి గట్టిగా బేడాను !! రామచంద్రా !!
ఫేషన్ అనుకొని పక్కనున్న ఆమె
టిక్కట్టు నేకొంటి రామచంద్రా
టిక్కెట్టుకే పట్టె జాకెట్టు ఖరీదు !!రామ!!
ఆవకాయకు అయేనా అరవయ్యి రూకలు !!రామ!!
మాగాయకు పట్టె మరి ఇరవై రూకలు !!రామ!!
లక్ష్మయ్యకే ఇస్తి సాక్షాత్తు యాభయ్యి !!రామ!!
కారమూ, ఉప్పును ఇంట్లోనే కొట్టిస్తి !!రామ!!
కాయలు స్వయముగా
చేయి చేసి తరిగితి !!రామ!!
ఇంత చేసిన పిదప ఎవడో చుట్టమువచ్చి
వఱ్ఱగా తినిపోవు ఎవడబ్బ సొమ్మని !!రామ!!
కొట్టులోపల అప్పు జోకొట్టితే పోవునా !!రామ!!


శ్రీ మాగంటి శివరామ శర్మ గారి పాత డైరీ నుండి


www.maganti.org