మీగడ తరకలు

ఆ - రుద్ర భూములన్నీ నావే కదండీ !


ఒక సారి సంగీత స్వరసమ్రాట్టు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు, ప్రముఖ సినీ రచయిత ఆరుద్రగారు హైదరాబాద్ విమానాశ్రయానికి కారులో వెడుతూండగ జరిగిన సంభాషణ. రాజేశ్వరరావుగారు 'ఆరుద్ర గారూ ! ఇక్కడ మీకేమైనా స్థలాలు ఉన్నాయా' అని అడిగారట. ఆరుద్రగారు ఒక్క క్షణం మౌనం వహించి దోవలో కనిపిస్తున్న ఖాళీ స్థలాలను చూపించి ' ఆ - రుద్ర భూములన్నీ నావే కదండీ రాజేశ్వరరావుగారూ ' అని బదులు చెప్పారట.

అలాగే ఇంకో చిన్న చమక్కు చెణుకు.ఆరుద్ర గారికి ఒకప్పుడు ధూమపానం అంటే ఆరో ప్రాణం. కొన్ని సంవత్సరాల తరువాత ధూమపానానికి స్వస్తి పలికారట. ఎందుకు మానేసారు అని అడిగిన మిత్రులకు ఆయన ఇచ్చిన జవాబు ' అవి వర్జీనియా పొగాకుతో తయారవుతాయి. వర్జించతగినవని అందులోనే ఉంది కదా! '


Source: Dr.Dwa.Na.Sastry

www.maganti.org