తెనాలి రామలింగడి కథలుగా, చాటువులుగా లోకంలో ఎన్నో ప్రచారంలో వున్నాయి. అల్లసాని పెద్దన ఒకచోట "అమవసనిసి" అనే అపప్రయోగం చేస్తే అతనిని అదే శైలిలో వెక్కిరిస్తూ రామలింగడు ఇలా అధిక్షేపించాడంటారు - |
"ఎమితిని సెపితివి కపితము
బ్రమపడి వెరిపుచ్చకాయ వడిదిని సెపితో ఉమెతకయను తినిసెపితో అమవసనిసి అన్నమాట అలసని పెదనా!" |
- అలాగే కాకమాని మూర్తికవి తన గురించి తాను చెప్పుకున్న ఈ పద్యం , అనాదిగా ఎంతో ప్రాచుర్యం పొందినదే - |
"అల్లసానివాని యల్లిక జిగిబిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు పాండురంగ విభుని పదగుంఫనంబును కాకమానిరాయ! నీకెతగుర." |
దీనిని రామలింగడు ఆక్షేపిస్తూ " నీకంత శక్తి ఎక్కడిదోయ్! అవికాక - దురదతో మ్రానికి వీపు రాయటం నీకే తగును. "కాక, మానిరాయ, నీకె తగుర" - అని విడదీసి వెక్కిరించాడట |