కందుకూరి వీరేశలింగం గారు బడిలో ఛందస్సు చెపుతూ ఆటవెలది లక్షణాలను వివరించారు. ఆ తర్వాత - |
"ఆటవెలది మీరలారసి చేయుడి
చేయకున్న మీకు సిగ్గుపాటు" |
- అని చెప్పి మిగిలిన రెండు పాదాలు పూరించమన్నారు. అప్పుడు కూచి నరసింహంగారు విద్యార్థిగా ఉండేవారు. ఈయన తరువాత మహావక్త, పండితులు అయ్యారు. వెంటనే కూచివారు ఇలా పూరంచి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసారట - |
"సిగ్గు లెన్నియున్న చెదరిపోవునుగద
ఆటవెలది పొంత నార్యులార!" |