1930 నాటి మాట. రాజమండ్రిలో శ్రీరామ బాలభక్త సంఘం వుండేది. దానికొక గ్రంథాలయం (ఇప్పటికీ వుంది). శ్రీరామ బాలభక్త వాజ్మయ సేవాసంఘం ఒక మాసపత్రికను కొన్నాళ్ళు నడిపింది. "విమర్శనలకు లోనౌదుమేమోయని వెనుదీయకుడు. విషయమునందు బాగుగ కృషిసల్పి వ్యాసములు వ్రాయుడు" అని ప్రకటించేవారు. పుట్రేవు శ్రీరామమూర్తి అనే కవి "ఆడుదాని పట్టు" అనే ఒక సీసపద్యం రాశారు. ఈ పద్యాన్ని చదివి ఎవరి అనుభూతి వాళ్ళు వ్యక్తీకరించాల్సిందే - లాలించి మగవాండ్ర గీలు బొమ్మల లీల నాడింతు రయ్యారె యాడువాండ్రు తియ్యని మాటలం దేలించి మగవాండ్ర నాడింతు రఝ్ఝ్రే యాడువాండ్రు మసిబూసి నెత్తికి మారేడుగాయగా నాడింతు రమ్మమ్మ యాడువాండ్రు అరచేత వైకుంఠమని చూపిపొరబెట్టి యాడింత్రు మగవాండ్ర నాడువాండ్రు చిటికెలోపల మగవాని జీలదీసి జుట్టుపట్టుక నాడించి తుట్టతుదకు గొంపనిలువున గూల్తురు తంపిబెట్టి ఆడుదానిని నమ్మినవాడు చెడడె?" ఈ లక్షణాలన్నీ చాలా మంది మగవాళ్ళకీ వర్తిస్తాయిగదా! |